Viral News: తోకతో పుట్టిన బాలుడు..!
Viral News: చైనాలో విచిత్రం చోటుచేసుకుంది. ఓ బాలుడు వెనుక భాగంలో తోకతో పుట్టాడు. అచ్చం కోతులకు ఉండే మాదిరిగా తోక మొలవడం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆ తోక పొడవు 3.9 అంగుళాలు ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. వెన్ను ఎముక పక్కనున్న కణాలకు అతుక్కోవడం వల్ల పిల్లల్లో ఇలాంటి లోపాలు వస్తాయని తెలిపారు. అయితే ఆ తోకను సర్జరీ ద్వారా తొలగించాలంటే మాత్రం కుదరని పని అని వైద్యులు తేల్చి చెప్పేసారు. ఎందుకంటే పిల్లాడి నాడి వ్యవస్థకు ఆ తోక కనెక్ట్ అయ్యి ఉందట. దానిని తొలగిస్తే జీవితాంతం పిల్లాడు మానసిక వికలాంగుడిగా మారిపోయే అవకాశం ఉందని అన్నారు. ఈ వెన్ను ఎముకను కోకిక్స్ అంటారు. ఇది మన గత అవశేషంగా పరిగణించాలి. ఈ వెన్ను ఎముక అసలు ప్రయోజనం చెట్లను ఎక్కేటప్పుడు సులువుగా బ్యాలెన్స్ తప్పకుండా చేయడం. ఇది మన పూర్వీకులకు ఉండేది కానీ ఇప్పుడు ఈ వెన్ను ఎముక ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు.