ISRO: భూమిని తాకనున్న భారీ ఉల్క.. యుగాంతమే అంటున్న ఇస్రో
ISRO: ఓ భారీ ఉల్క భూమిని తాకనుంది. అదే జరిగితే యుగాంతమే అని ఇస్రో చీఫ్ సోమనాథన్ అంటున్నారు. 2029 ఏప్రిల్ 13న ఒకసారి.. ఆ తర్వాత 2036లో మరోసారి అతి భారీ ఉల్క భూమిని తాకనుందట. ఈ రెండింటిలో ఏది సంభవించినా యుగాంతం జరిగే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.
సైబీరియాలోని తుంగుస్కా ప్రాంతంలో 1908లో ఓసారి భారీ ఉల్క పడింది. ఆ సమయంలో 2,200 చదరపు అడుగుల అడవి మొత్తం అంతరించిపోయింది. 8 కోట్ల వృక్షాలు కుప్పకూలిపోయాయి. 2029, 2036లో పడబోయే ఉల్క సైజు 370 మీటర్లు ఉంటుందట. ఉల్క సైజు 10 కిలోమీటర్లు కానీ లేదా అంత కంటే ఎక్కువ సైజు ఉన్నవి భూమికి తాకితే యుగాంతం జరిగే అవకాశాలు చాలా ఎక్కువట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పేస్ కేంద్రాలు ఇలాంటి ఉల్కల నుంచి భూగ్రహాన్ని కాపాడేందుకు పరిశోధనలు చేపడుతున్నాయి.
వీటికి ISRO కూడా తన వంతు సాయం చేస్తోంది. ఇలాంటి ఉల్కలు భూమిని తగలడం అరుదైనప్పటికీ విధ్వంసం మాత్రం ఘోరంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఉల్కలను ముందే పసిగట్టే టెక్నాలజీని రూపొందిస్తున్నారు.