Delhi: పెదాలను కోసేసి.. 85 ఏళ్ల వృద్ధురాలిపై రేప్
ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? (delhi) జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధురాలిపై కన్నేసాడు ఓ 28 ఏళ్ల నీచుడు. ఆమె ఒంటరిగా ఉండటం చూసి దారుణానికి ఒడిగట్టాడు. ఆమెపై అత్యాచారం చేసి పెదాలను కత్తితో కోసేసాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. నేతాజీ సుభాష్ నగర్‌కు చెందిన 28 ఏళ్ల ఆకాష్ అనే వ్యక్తి.. అదే ప్రాంతానికి చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు ఇంట్లో నిద్రిస్తుండగా ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ వృద్ధురాలిని దారుణంగా కొట్టడంతో ఆమె తీవ్రగాయాల పాలైంది. ప్రస్తుతం ఆమె కండీషన్ కాస్త సీరియస్‌గానే ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ (dcw) స్వాతి మలివాల్ (swati maliwal) స్పందిస్తూ.. నిందితుడిని కఠినంగా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. (Delhi)