ఇప్పటికీ భారతీయులు పోర్న్‌పైనే ఆధారపడుతున్నారు
సెక్స్ ఎడ్యుకేషన్ (sex education) అనేది ఎంతో ముఖ్యం. ఇప్పుడు పిల్లలకు దీని గురించి అర్థమయ్యే రీతిలో వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ రోజులు మారుతున్నప్పటికీ ఇంకా పిల్లలకు ఈ అంశం గురించి వివరించే పద్ధతి మాత్రం మారడంలేదు. ఓ సర్వే ప్రకారం సెక్స్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకునేందుకు ఇప్పటికీ పోర్నోగ్రఫీ పైనే ఆధారపడేవారి సంఖ్య 57.32% ఉంది. 65.42% మంది సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. 530 భారతీయ నగరాలకు చెందిన దాదాపు 9000 మందితో ఈ సర్వేను నిర్వహించారు. దేశంలో కేవలం 7.93% మాత్రమే సెక్స్ ఎడ్యుకేషన్ కోసం తమ తల్లిదండ్రులను అడిగి తెలుసుకుంటున్నారట.
ఇప్పటికీ పోర్నోగ్రఫీపై ఆధారపడుతున్న సంఖ్యను చూస్తుంటే ఆందోళనకరంగా ఉందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది వేరు.. పోర్నోగ్రఫీ అనేది వేరు. పోర్నోగ్రఫీ వల్ల తెలుసుకోవాలనుకున్న విషయాన్ని కాకుండా వేరే రకంగా ప్రజలు అర్థం చేసుకునే ప్రమాదం ఉందని అంటున్నారు. పోర్నోగ్రఫీ వీడియోల్లో మహిళలను కొట్టడం వంటివి చూపిస్తుంటారని.. అది చూసి సెక్స్ అంటే అలాగే ఉంటుందని మహిళలపై అకృత్యాలకు పాల్పడే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడుతున్నారు.