Terror Attack: ఎంతకు తెగించార్రా..!
Bengaluru: పై ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తులు కర్ణాటక రాజధాని బెంగళూరులో (banglore) టెర్రర్ ఎటాక్ (terror attack) ప్లాన్ చేయాలనుకున్నారట. విషయం తెలీడంతో పోలీసులు వెంటనే వీరిని అదుపులోకి తీసుకున్నారు. జునైద్ అనే మరో అనుమానితుడు తప్పించుకుని తిరుగుతున్నాడు. అతని కోసం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు గాలిస్తున్నారు. జునైద్ అనే వ్యక్తి దాడులకు కావాల్సిన వస్తువులను సప్లై చేస్తుంటాడట. పోలీసులు వెతుకున్నారని తెలిసి విదేశాలకు పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఎటాక్ ప్లాన్ వెనక ఉన్న మాస్టర్ మైండ్ జునైదేనని పోలీసులు తెలిపారు.
వీరంతా 2017లో ఓ మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆ మర్డర్ వీరు చేయలేదని, కానీ సహకరించారని తెలిసి 2019లో రిలీజ్ చేసారు. విచారణలో తమకు టి నజీర్ అనే వ్యక్తితో సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. ఓ టెర్రర్ ఎటాక్‌లో (terror attack) నజీర్ అనుమానితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం నజీర్ పరపన్న అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. నజీర్ ఈ ఐదుగురినీ ర్యాడికలైజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.