Isro 200 కోట్లు ఇస్తుందని చెప్పి ఘరానా మోసం
మమ్మల్ని నమ్మండి.. ఇస్రో (isro) మీకు రూ.200 కోట్లు ఇస్తుంది.. అని చెప్పి పాపం ఓ రైతుని నట్టేట ముంచేసారు. వారి మాటలు విన్న ఆ రైతు అక్షరాలా కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన పుణెలో (pune) చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు కలిసి ఓ కాంస్య కుండను తీసుకెళ్లి పుణెకు చెందిన రైతు దగ్గరికి వెళ్లారు. అది 250 ఏళ్ల నాటిదని.. దీనిని ఇస్రో, నాసా వారు రూ.200 కోట్లకు కొనుగోలు చేస్తుంటారని నమ్మబలికారు. ఆ కుండలో స్పెషల్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీలు ఉంటాయని వాటితో నాసా, ఇస్రో పరిశోధనలు చేస్తుంటుందని చెప్పారు. దాంతో ఆ రైతు నమ్మి తాను కొనుక్కుంటానని అన్నాడు. అలా తన చేత పొలం అమ్మించి కోటి రూపాయల వరకు తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా ఇస్రో వారు ఇంకా తన దగ్గరికి రాలేదని ఎప్పుడొస్తారని అడుగుతున్నప్పటికీ ఇదిగో వస్తారు అదిగో వస్తారు అని పత్తా లేకుండాపోయారు. (isro)
దాంతో తాను మోసపోయానని తెలుసుకున్న ఆ రైతు లబోదిబోమంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసాడు. అతను తెలిపిన వివరాలను నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే ఆ నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు.