Real Estate: 48 గంటల్లో అమ్ముడుపోయిన 3000 కోట్ల విలువైన ఇళ్లు
Real Estate: ఒక రియల్ ఎస్టేట్ సంస్థ తమ వద్ద ఇన్ని ఇళ్లు అమ్మకానికి ఉన్నాయి అని ప్రకటించిన 48 గంటల్లోనే ఏకంగా రూ.3000 కోట్ల విలువైన ఇళ్లు అమ్ముడుపోయాయి. ఘజియాబాద్‌కి చెందిన గౌర్ గ్రూప్ అనే సంస్థకు ఉన్న గిరాకీ అలాంటిది. గౌర్ గ్రూప్ కట్టే ఇళ్లకు ఎందుకింత గిరాకీ అంటే.. వారు అన్ని అపార్ట్‌మెంట్లను న్యూయార్క్ స్టైల్‌లో నిర్మిస్తుంటారు. అందుకే ఆ సంస్థ కోట్లల్లో లాభాలు అర్జిస్తోంది. అందుకే గౌర్ గ్రూప్ సంస్థ వారు ఈ అపార్ట్‌మెంట్లకు NYC రెసిడెన్సెస్ అని నామకరణం చేసారు. 11.80 ఎకరాల్లో 10 టవర్లలో ఫ్లాట్లను నిర్మించారు.
ఒక్కో టవర్‌లో 32 అంతస్తులు ఉన్నాయి. ఈ 10 టవర్లలో 1200 లగ్జరీ అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అన్నీ 4 బెడ్‌రూంల ఫ్లాట్‌గానే నిర్మించారు. ఇక్కడ ఒక్కో ఫ్లాట్ ధర రూ.2.50 కోట్ల నుంచి మొదలవుతుంది. ఈ అపార్ట్‌మెంట్లలో 118 మీటర్ల పొడవైన స్విమ్మింగ్ పూల్‌తో పాటు ఇతర లగ్జరీ సౌలభ్యాలు కూడా ఉంటాయి. ఈ అపార్ట్‌మెంట్లలో నివసించే వారికి ఇండియాలో నివసిస్తున్నట్లు అనిపించదట. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంటున్నామా అనే అనుభూతి కలుగుతుంటుందని చెప్తున్నారు. ఇలాంటి అపార్ట్‌మెంట్లనే ఇప్పుడు గురుగ్రామ్, నోయిడాలోనూ నిర్మించాలని చూస్తున్నారు.