Mushroom: కోడ‌లి వంట‌.. ముగ్గురు మృతి

Hyderabad: పాపం కోడ‌లు ఇంట్లోవారికి ఎంతో ప్రేమ‌గా వండిపెట్టాల‌నుకుంది. ఆ వంట తిని ముగ్గురు చ‌నిపోతారని క‌ల‌లో కూడా ఊహించ‌లేక‌పోయింది. అయితే ఇక్క‌డ పాపం కోడ‌లి త‌ప్పేం లేదండోయ్. ఆమె వండిన పుట్ట‌గొడుగుల‌దే (mushroom) త‌ప్పు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. ఆస్ట్రేలియాకు (australia) చెందిన ఎరిన్ అనే మ‌హిళ ఇంట్లో చిన్న గెట్ టుగెద‌ర్ ఏర్పాటు చేసింది. త‌న చుట్టాల‌ను డిన్న‌ర్‌కి పిలిచింది. వారికి పుట్ట‌గొడుగుల‌తో (mushroom) ఏదో స్పెష‌ల్ క‌ర్రీ వండిపెట్టింది. డిన్న‌ర్ అయ్యాక అంతా ఎవ‌రింటికి వారు వెళ్లిపోయారు. అయితే వారం రోజుల త‌ర్వాత ఎరిన్‌కి షాకింగ్ విష‌యం తెలిసింది. ఎరిన్ అత్తామామ‌లు, మ‌రో బంధువు చ‌నిపోయార‌ని తెలిసింది. వీరితో పాటు మ‌రో వ్య‌క్తి ప‌రిస్థితి క్రిటిక‌ల్‌గా ఉంద‌ట‌.

దాంతో పోలీసులు ఎరిన్‌ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఎరిన్ ఇంట్లో తిన్న‌వారిలో ముగ్గురు చ‌నిపోయారు. మ‌రో వ్య‌క్తి చావు బ‌తుకుల మ‌ధ్య ఉన్నాడు. కానీ ఎరిన్‌కి మాత్రం ఏమీ కాలేదు. దాంతో ఆమె కావాల‌ని త‌న అత్తామామ‌ల‌ను చంపాల‌నుకుంద‌ని, అందుకే వైల్డ్ పుట్ట‌గొడుగుల‌ను తెచ్చి వండిపెట్టింద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ ఎరిన్ మాత్రం అస‌లు త‌న‌కు అలాంటి ఉద్దేశ‌మేమీ లేద‌ని తెలిపింది. ప్ర‌స్తుతానికైతే పోలీసులు ఎరిన్‌ని వ‌దిలేసారు. కానీ ప్ర‌ధాన అనుమానితురాలిగా ఆమే ఉంది. అస‌లు ఏం జరిగి ఉంటుందా అని యావ‌త్ ఆస్ట్రేలియాలో ఈ కేసును ఆసక్తిగా చూస్తున్నారు.