Banjara Hills: తనిఖీల్లో ల‌భించిన రూ.3.35 కోట్లు

ఎన్నిక‌ల పోల్ కోడ్ (poll code) అమ‌ల్లో ఉన్న నేప‌థ్యంలో తనిఖీల్లో భాగంగా టీవీ9 ఆఫీస్ వద్ద కియా కారులో 3.35 కోట్ల రూపాయలు తరలిస్తున్న వారిని బంజారా హిల్స్ (banjara hills) పోలీసులు ప‌ట్టుకున్నారు. నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎన్నిక‌లు అయ్యేవ‌ర‌కు తెలంగాణ పోలీసులు విస్త్ర‌తంగా త‌నిఖీలు నిర్వ‌హించ‌నున్నారు. (telangana elections)