మద్యం తాగి 25 మంది దుర్మరణం
Iran: యుద్ధం కారణంగా అల్లాడిపోతున్న ఇరాన్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. మెథనాల్ కలిపిన మద్యం తాగి దాదాపు 25 మంది మృత్యువాతపడ్డారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. మజందారన్, గిలాన్, హమదాన్ ప్రాంతాలకు చెందిన పలువురు యువతీ, యువకులు మెథనాల్ కలిపిన మద్యం అని తెలీక తాగేయడంతో ఈ దారుణం చోటుచేసుకుంది.
1979లో ఇస్లాం రాజ్యం ఏర్పడంతో ఇరాన్‌లో మద్యాన్ని పూర్తిగా నిషేధించారు. దాంతో మద్య ప్రియులు తాగకుండా ఉండలేక ఎవరికి వారు ఇంట్లో తమకు వచ్చినట్లుగా మద్యాన్ని తయారు చేసుకుని తాగేస్తున్నారట. ఈ నేపథ్యంలో మెథనాల్ కలిపిన పదార్థాలతో మద్యం తయారుచేసుకుని తాగి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 2023 అక్టోబర్‌లో ఇలాగే మద్యం తయారుచేసుకుని తాగడంతో 40 మంది చనిపోయారు. 2020లో 700 మందికి పైగా కల్తీ మద్యం తాగి చనిపోయారు.