Viral news: 22 ఏళ్ల యువ‌కుడు.. 5 భార్య‌ల‌కు ఒకేసారి శ్రీమంతం!

Viral news: వ‌య‌సు ప‌ట్టుమ‌ని 25 కూడా లేవు. అప్పుడే ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా ఐదుగురు భార్య‌లు. పైగా వారింద‌రికీ ఒకేసారి శ్రీమంతం జ‌రిపించాడు ఓ యువ‌కుడు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. జెడ్డీ విల్ అనే 22 ఏళ్ల మ్యూజిషియ‌న్ ఏకంగా ఐదుగురు యువ‌తుల‌ను ఒకేసారి ప్రేమించి పెళ్లి చేసుకుని వారిని ప్రెగ్నెంట్ అయ్యేలా చేసాడు. పైగా దీనికి వారంతా ఒప్పుకోవ‌డం షాకింగ్ అంశం. ఇప్పుడు వారందరికీ ఒకేసారి గ్రాండ్‌గా శ్రీమంతం జ‌రిపించాడు. శ్రీమంతం వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్ చేయ‌డంతో విష‌యం వైర‌ల్‌గా మారింది.