Chandrayaan 3: రేపు 20 నిమిషాల T20 మ్యాచ్..!

చంద్ర‌యాన్ 3కి (chandrayaan 3) టీ20 మ్యాచ్‌కి ఏం సంబంధం అని అనుకంటున్నారా? రేపు సాయంత్రం విక్ర‌మ్ ల్యాండ‌ర్ (vikram lander) చంద్రుడి ద‌క్షిణ ధ్రువం వైపు సాఫ్ట్ ల్యాండింగ్ చేయ‌బోతోంది. చంద్రుడిపై విక్ర‌మ్ కాళ్లు మోపడానికి ఉండే 20 నిమిషాల స‌మ‌యాన్ని అతి భ‌యంక‌ర‌మైన‌దిగా.. ఒక టీ20 మ్యాచ్‌లో టైట్ ఫినిష్‌లా ఉండబోతోంద‌ని ఇస్రో (isro) వెల్ల‌డించింది. ఈసారి ఏది ఏమైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా చంద్ర‌యాన్ 3ని విజ‌య‌వంతం చేసి తీరాల‌ని ఇస్రో బ‌లంగా నిర్ణ‌యించుకుంది. ఇందుకోసం చంద్ర‌యాన్ 2ని ప్ర‌వేశ‌పెడుతున్న‌ప్పుడు ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో వాటిని ప‌రిశీలించి ఎన్ని అడ్డంకులు ఎదురైనా విక్ర‌మ్ ల్యాండ‌ర్ జాబిల్లిని చేరుకునేలా దీనిని డిజైన్ చేసారు. (chandrayaan 3)

విక్ర‌మ్ ల్యాండ‌ర్ కాళ్ల‌ను ఈసారి మ‌రింత దృఢంగా డిజైన్ చేసారు. చంద్రుడి ఫొటోల‌ను ఎప్పుడూ చూసినా మ‌న‌కు గుంత‌లు గుంత‌లుగా క‌నిపిస్తుంటాయి. మ‌నం ఫొటోల్లో చూసేదానికంటే ఆ గుంత‌లు మ‌రింత లోతుగా ఉంటాయి. అందుకే విక్ర‌మ్ ల్యాండ‌ర్ జాబిల్లిపై కాలు పెట్టే స‌మ‌యంలో గుంత‌ల్లోకి దిగినా కూడా నిల‌దొక్కుకునేలా డిజైన్ చేసారు. ఈ ల్యాండ‌ర్ పాదాన్ని అంటే ఏదైతే చంద్రుడిపై కాలు మోపుతుందో దానిని డాంప‌ర్ అనే ప‌దార్థంతో త‌యారుచేసారు. ఇక మ‌న ఇస్రో చేప‌ట్టిన ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క మిష‌న్‌ను రేపు టీవీలో ప్ర‌త్య‌క్షంగా చూపించ‌బోతున్నారు. (chandrayaan 3)