Hyderabad: ట్రాన్స్‌జెండ‌ర్ల దారుణ హ‌త్య‌

Hyderabad: హైద‌రాబాద్‌లో (hyderabad) దారుణం చోటుచేసుకుంది. ఇద్ద‌రు హిజ్రాలు (transgenders) దారుణ హత్య‌కు గుర‌య్యారు. మంగ‌ళ‌వారం రాత్రి దైబాగ్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. స్కూట‌ర్‌లో ఇద్ద‌రూ క‌లిసి ఇంటికి వెళ్తున్న స‌మ‌యంలో మాటు వేసి కొంద‌రు వ్య‌క్తులు క‌త్తితో పొడిచి రాళ్ల‌తో కొట్టి చంపిన‌ట్లు పోలీసులు తెలిపారు. మృతులు డాలి (25), సోఫియా (30)గా పోలీసులు గుర్తించారు. హ‌త్య జ‌రిగిన గంట త‌ర్వాత పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. చంప‌డానికి వాడిన క‌త్తి కోసం గాలిస్తున్నారు.