పోర్న్‌కి అలవాటుపడి బాలుడిపై అత్యాచారం
Viral News: పోర్న్‌కి అలవాటుపడి అభంశుభం తెలీని ఓ బాలుడిని పొట్టనపెట్టుకున్నారు ఇద్దరు రాక్షసులు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో చోటుచేసుకుంది. మద్రాసాకు చెందిన 9 ఏళ్ల బాలుడిని ఇద్దరు వ్యక్తులు లైంగికంగా వేధించారు. పైగా వారిద్దరూ ఆ బాలుడి బంధువులే. వీరిద్దరూ పోర్న్‌కి అలవాటుపడ్డారు. నిందితుల్లో ఒకరైన దిల్నవాజ్ అదే మద్రాసాలో బోధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను 9 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేసాడు. ఆ తర్వాత విషయం బయటికి తెలిస్తే సమస్య అవుతుందని దారుణంగా చంపేసాడు.
ఆ తర్వాత రక్ముద్దీన్ అనే మరో వ్యక్తి సాయంతో బాలుడి మృతదేహాన్ని దగ్గర్లోని శ్మశానం వద్ద ఉన్న బావిలో పడేసారు. ఆ తర్వాత ఎవ్వరికీ అనుమానం రాకూడదని బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలుడు మద్రాసా నుంచి పారిపోయాడని చెప్పాడు. తల్లిదండ్రులకు అనుమానం రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఇద్దరు వ్యక్తులపై అనుమానం రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఈ దారుణం బయటపడింది.