పోలీస్ అంకుల్.. మా నాన్నను అరెస్ట్ చేయండి ప్లీజ్
Madhya pradesh: ఇద్దరు పిల్లలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తండ్రిపై కంప్లైంట్ చేయడంతో పోలీసులు చలించిపోయారు (viral news). ఈ బాధాకర ఘటన మధ్యప్రదేశ్‌లో (madhya pradesh) చోటుచేసుకుంది. గ్వాలియర్ జిల్లాలోని భితర్వాల్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు పనిలో మునిగిపోయి ఉన్నారు. అదే సమయంలో ఇద్దరు ఆడపిల్లలు స్టేషన్‌కు వెళ్లి బిత్తర చూపులు చూస్తూ నిలబడ్డారు. వారిని చూసిన పోలీస్ కానిస్టేబుల్ ఏం కావాలి అని అడిగితే.. నాన్నను అరెస్ట్ చేయండి అంకుల్ అంటూ ఏడ్చి తమ బాధను చెప్పుకున్నారు. వెంటనే ఆ కానిస్టేబుల్ స్టేషన్ ఇన్‌చార్జి ప్రదీప్ శర్మకు చెప్పాడు. ప్రదీప్ వెంటనే ఆ పిల్లల్ని తన క్యాబిన్‌లోకి పిలిపించి కూర్చోబెట్టుకున్నాడు. భయపడకండి. ఏం జరిగిందో ధైర్యంగా చెప్పండి అంటూ నెమ్మదిగా మాట్లాడాడు. దాంతో ఆ పిల్లలు ఏడుస్తూ.. అంకుల్ మా అమ్మా నాన్నలు రోజూ గొడవపడుతుంటారు. దాంతో నాన్న కోపంతో అమ్మను కొడుతున్నాడు. మా వల్ల కావడంలేదు. మా నాన్నను జైల్‌లో పెట్టండి అని చెప్పారు.
దాంతో ప్రదీప్‌కి వారిని చూసి జాలేసింది. వారికి భోజనం పెట్టించాడు. ఆ తర్వాత పిల్లల్ని తీసుకుని వారి ఇంటికి వెళ్లి భార్యా భర్తలకు నచ్చజెప్పాడు. ఇలా కొట్టుకుంటే పిల్లలపై ప్రభావం పడుతుందని, ఇంకోసారి కొట్లాడుకున్నట్లు తెలిస్తే జైల్లో పెడతానని హెచ్చరించాడు. పిల్లలకు ధైర్యం చెప్పి పంపించారు.