Viral News: అమ్మాయి కోసం బ‌దిర యువ‌కుల బ‌రితెగింపు

2 dumb and deaf men kill their friend for a girl

Viral News:  ఆ ముగ్గురూ స్నేహితులు. ముగ్గురూ బ‌దిరులు. అలాంటి వీరి జీవితంలోకి ఓ అమ్మాయి ప్ర‌వేశించింది. కాక‌పోతే ఆ అమ్మాయి వీరిలో ఎవ్వ‌రినీ ప్రేమించ‌డం లేదు. వీరే ఏవేవో ఊహించేసుకుని ఆ అమ్మాయి కోసం కొట్లాడుకున్నారు. అలా ఇద్ద‌రు క‌లిసి మూడో వాడిని దారుణంగా చంపేసారు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో చోటుచేసుకుంది. సాంటాక్రూజ్ ప్రాంతానికి చెందిన‌ ప్ర‌వీణ్, సురేంద్ర, అర్ష‌ద్ స్నేహితులు.

వీరు ముగ్గురూ ఒకే అమ్మాయిని ఇష్ట‌ప‌డుతున్నారు. ఈ విష‌యంలో ముగ్గురూ ఎప్పుడూ కొట్లాడుకునేవారు. ఓ రోజు ఈ విష‌యం కాస్త సీరియ‌స్ అయ్యింది. ప్ర‌వీణ్, సురేంద్ర క‌లిసి ఆ అమ్మాయి ద‌క్కితే నీకైనా ద‌క్కాలి లేదా నాకైనా ద‌క్కాలి కానీ ఆ అర్ష‌ద్‌కి మాత్రం ద‌క్క‌కూడ‌దు అని కుట్ర ప‌న్నారు. అలా ఎవ్వ‌రూలేని స‌మ‌యంలో క‌త్తితో అర్ష‌ద్‌ను పొడిచి దారుణంగా హ‌త్య చేసారు.

ఎవ్వరికీ అనుమానం రాకుండా మృత‌దేహాన్ని ఊరి చివ‌ర్లో ప‌డేయాల‌ని అనుకున్నారు. ప్లాన్ ప్రకారం ఓ సూట్‌కేసులో బాడీని కుక్కి రైలు ఎక్కేందుకు వెళ్లారు. ఇక్క‌డే వారు దొరికిపోయారు. వారి సూట్‌కేస్ నుంచి ర‌క్తం కారుతుండ‌డం రైల్వే పోలీసులు చూసారు. వారిని తీసుకెళ్లి సైగ‌ల భాష‌లో విచారించ‌గా వీరి బండారం బ‌య‌ట‌ప‌డింది. ఇద్ద‌రినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.