15 ఏళ్లకే ప్రేమ.. అడ్డొచ్చినందుకు తండ్రి, సోదరుడి దారుణ హత్య
Viral News: 15 ఏళ్లకే ఓ యువకుడిని ప్రేమించి.. అతన్ని పోలీసులకు పట్టించినందుకు తండ్రి, సోదరుడిని చంపేసింది ఓ బాలిక. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని జబల్‌పూర్‌లో చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలిక స్థానికంగా నివసిస్తున్న 19 ఏళ్ల ముకుల్ సింగ్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉంది. ఇంట్లో వారికి విషయం తెలిసి వారు మందలించడంతో వీరిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయారు. దాంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అలా పోలీసులు మైనర్‌ను ఎత్తుకెళ్లినందుకు ముకుల్‌ను అరెస్ట్ చేసారు.
ఆ తర్వాత కొన్ని నెలలకు ముకుల్ బెయిల్‌పై బయటికి వచ్చాడు. ఆ వెంటనే తన ప్రియురాలిని కలిసేందుకు వెళ్లాడు. తన ప్రియుడిని జైల్లో పెట్టించినందుకు ఆ బాలిక ముకుల్‌తో కలిసి తండ్రిని చంపాలని ప్లాన్ వేసారు. తండ్రి నిద్రపోతున్నప్పుడు దిండుతో నొక్కి చంపబోతుండగా.. పక్కనే నిద్రిస్తున్న సోదరుడు లేచి వారిని ఆపేందుకు యత్నించాడు. అలా సోదరుడిని కూడా చంపి పరారయ్యారు. ఆ మరుసటి రోజే పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసారు.