Covid: తెలంగాణ‌లో కొత్త‌గా 12 కేసులు.. హైద‌రాబాద్‌లో 9

Covid: ఈరోజు తెలంగాణ మొత్తంలో కొత్తగా 12 కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. వాటిలో 9 కేసులు హైద‌రాబాద్‌లో ఉన్న‌వే. ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ‌లో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 38. రంగారెడ్డి, సంగారెడ్డి, వ‌రంగ‌ల్ జిల్లాల్లో కేసులు ఎక్కువ‌గా ఉన్నాయి. ఈరోజు మొత్తం 1322 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఇంకా 38 మంది రిపోర్టులు రావాల్సి ఉంది.