Earth: 12 కోట్ల ఏళ్ల క్రితం కనిపించకుండాపోయిన భూభాగం గుర్తింపు
Earth: 120 మిలియన్ సంవత్సరాలు.. అంటే దాదాపు 12 కోట్ల సంవత్సరాల క్రితం కనిపించకుండాపోయిన ఓ భూమి భాగాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ భూమి భాగం ఎక్కడుందో తెలుసా? బోర్నియో అనే ద్వీపంలో. ఈ బోర్నియో ఆసియా ఖండంలోనే మూడో అతిపెద్ద ద్వీపం. ఆసియా పెసిఫిక్ ప్రాంతంలో చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్న యూట్రెచ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలకు ఈ భూభాగం బోర్నియో కనిపించింది. అంటే ఆ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కనుక్కునేంతవరకు ఈ భూభాగం భూగ్రహంపై ఉందన్న సంగతి కూడా ఎవ్వరికీ తెలీదు. ప్రస్తుతానికి ఈ మూడో అతిపెద్ద ద్వీపం అయిన బోర్నియోని మలేషియా, బ్రూనెయ్, ఫిలిప్పీన్స్ దేశాలు కలిసి పంచుకున్నాయి. దీనిపై మరిన్ని వివరాలను శాస్త్రవేత్తలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.