Police Recruitment: ఫిజిక‌ల్ టెస్ట్‌లు నిర్వ‌హిస్తుండ‌గా 11 మంది ట్రైనీలు మృతి

11 police trainees die during Police Recruitment physical tests

Police Recruitment:  ఝార్ఖండ్‌లో వింత ఘ‌ట‌న చోటుచేసుకుంది. పోలీస్ రిక్రూట్మెంట్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ట్రైనీల‌కు ఫిజిక‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో దాదాపు 11 మంది పోలీస్ ట్రైనీలు మృతిచెందారు. ఆగ‌స్ట్ 22న ఝార్ఖండ్‌లోని రాంచి, గిరిదిహ్‌, హ‌జారీబాగ్, ప‌లాము, తూర్పు సింగ్‌భుమ్‌, సాహెబ్ గంజ్ జిల్లాల్లో ఎక్సైజ్ కానిస్టేబుల్ పోటీ పరీక్ష‌లు జ‌రిగాయి. ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్ధుల‌కు ఫిజిక‌ల్ టెస్టులు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో వివిధ జిల్లాల‌కు చెందిన ట్రైనీలు అనుమానాస్ప‌దంగా మృతిచెందారు. దాంతో అస‌హ‌జ మ‌ర‌ణాల కింద కేసులు న‌మోదు చేసి పోలీసులు దర్యాప్తు చేప‌డుతున్నారు. ఆగ‌స్ట్ 30న 1,27,772 అభ్య‌ర్ధులు పోటీ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకాగా 78,023 మంది క్లియ‌ర్ చేసారు.