Heart Attack: గర్భా డ్యాన్స్ చేస్తుండగా 10 మందికి గుండెపోటు..!
దేశంలో గుండెపోటు (heart attack) మరణాలు ఎంత అధికంగా ఉన్నాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. దసరా సందర్భంగా గర్భా డ్యాన్స్ (garbha dance) చేస్తూ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 10 మంది చనిపోయారు. ఈ మరణాలన్నీ కూడా గుజరాత్ (gujarat) రాష్ట్రంలో సంభవించాయి. వీరంతా కూడా గడిచిన 24 గంటల్లో చనిపోయినవారే. మృతుల్లో 13 ఏళ్ల కుర్రాడి నుంచి 40 ఏళ్ల వయసువారు వరకు ఉన్నారు. అంతేకాదు.. నవరాత్రులు మొదలైన మొదటి ఆరు రోజుల్లో ఆంబులెన్స్ సర్వీసెస్‌కు గుండెపోటుకు సంబంధించి వచ్చిన కాల్స్ సంఖ్య 521.
అంతేకాదు.. ఊపిరి ఆడటం లేదంటూ దాదాపు 609 మంది ఆంబులెన్స్ సర్వీసులను పిలిపించారు. ఈ ఫోన్ కాల్స్ అన్నీ కూడా సాయంత్రం 6 నుంచి అర్థరాత్రి 2 గంటల సమయంలో వచ్చినవే. దాంతో గుజరాత్ ప్రభుత్వం అలెర్ట్ అయింది. గర్భా ఈవెంట్స్ ఏర్పాటుచేసేవారికి రెండు గంటలకు మించి డ్యాన్సులు నిర్వహించకూడదని సౌండ్ కూడా ఎక్కువగా పెట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. (heart attack)