Bank: డ్రైవర్ ఖాతాలోకి రూ.9000 కోట్లు..!
ఓ కారు డ్రైవర్ ఖాతాలోకి రూ.9000 కోట్లను డిపాజిట్ చేసింది చెన్నైకి చెందిన తమిళనాడు మర్సెంటైల్ బ్యాంక్ (bank). ఆ డ్రైవర్‌కి ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాక తన బ్యాంక్ ఖాతాను చూసుకుంటూ కూర్చుండిపోయాడట. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే బ్యాంక్ మళ్లీ ఆ రూ.9000 కోట్లను వెనక్కి తీసేసుకుంది. అలా ఆ డ్రైవర్ ఒక అరగంట పాటు దేశంలోనే అత్యంత సంపన్న డ్రైవర్ అయిపోయాడు. అసలు ఎప్పుడూ చూడని డబ్బు మన ఖాతాలో పడితే ఎంత సంతోషంగా ఉంటుందో.. అది మనది కాదు అని తెలిస్తే ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో కదా..!