Telangana Elections: అభ్యర్ధుల ప్రకటన పూర్తి.. అయినా ఆగని చేరికలు
Telangana Elections: తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార BRS పార్టీలోకి చేరికలు అధికమయ్యాయి. విచిత్రమేంటంటే.. ఇంకా ఏ పార్టీ అయితే ఇంకా పూర్తి అభ్యర్ధులను ప్రకటించలేదో ఆ పార్టీలోకి జంప్ అవ్వాలని చూస్తుంటారు. మిగిలిన సీట్లలో ఏదో ఒక సీటు నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తారేమోనని. కానీ ఇక్కడ రివర్స్‌లో ఉంది. BJP ఇంకా మూడో లిస్ట్ ప్రకటించాల్సి ఉండగా.. కాంగ్రెస్ (congress) ఆల్మోస్ట్ అన్ని స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించేసింది. అందరికంటే ముందు అన్నీ సీట్లను ప్రకటించిన BRS పార్టీ.
అభ్యర్ధులను ప్రకటించేసినప్పటికీ కాంగ్రెస్, BJP నుంచి BRSలోకి జంప్ అవుతున్నారు. ఇందుకు కారణం.. సొంత పార్టీని నమ్ముకుంటే టికెట్ ఇవ్వకుండా పంగ నామాలు పెట్టింది కాబట్టి ఆ పార్టీకి రాజీనామా చేసేసి వేరే పార్టీలో చేరితే వారు ఇచ్చే వేరే పదవులైనా తీసుకోవచ్చు అని చిన్న ఆశ. దీని వల్ల టికెట్ ఇవ్వని పార్టీపై పగ తీర్చుకున్నట్లు అవుతుందని కొందరి అభిప్రాయం.
మరోపక్క పార్టీలు టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలు బయటపెడుతున్నారు. ఎవరికైతే గెలిచే ఛాన్సులు ఉన్నాయో వారికే ఇస్తారని.. క్షేత్రస్థాయిలో రీసెర్చ్ చేసాకే టికెట్లు కేటాయించామని అంటున్నారు. పార్టీకి ఎంతో కాలంగా నమ్మకస్థులుగా ఉన్నామని అన్నప్పుడు టికెట్ ఇవ్వనంతమాత్రాన మొన్నటివరకు తిట్టిన పార్టీల్లోనే చేరిపోవడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.