హైదరాబాద్లో 250 కి.మీ మెట్రో మార్గం
తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ కట్టుబడి ఉంటారని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా హైదరాబాద్ నగరంలో 250 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాన్ని తీసుకు వస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఖాజాగూడ చెరువు అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర్ మాట్లాడుతూ.. నగర వ్యాప్తంగా మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా చూస్తామని. రాయదుర్గ్ మెట్రోరైలు లైన్ను పొడిగిస్తున్నామని ఖాజాగూడ చెరువు పక్కనుండే ఎయిర్ పోర్టుకు వెళుతుందని తెలిపారు. మూడు ఏళ్లలో 31 కిలోమీటర్ల మెట్రో అందుబాటులోకి వస్తుందన్నారు. హైదరాబాద్ నగరంలో రాబోయే కొద్ది రోజుల్లో ప్రపంచంలో 50% వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయని తెలిపారు. భారీగా పెట్టుబడులు హైదరాబాద్ నగరానికి వస్తున్నాయని దాంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించబడుతున్నాయని చెప్పారు. మెడికల్ మాత్రమే కాకుండా ఐటీ రంగంలో కూడా హైదరాబాద్ విపరీతంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
రాబోయే రోజుల్లో చాలా ఎక్కువగా పెట్టుబడులు హైదరాబాద్ కు వస్తాయని చెప్పారు. ఇప్పుడు హైదరాబాదులో జరుగుతున్నది ప్రారంభం మాత్రమేనని.. భవిష్యత్తులో చాలా వేగవంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. మెట్రోను పొడిగిస్తున్నామని ఖాజాగూడ చెరువు పక్కనుండే ఎయిర్ పోర్టుకు వెళుతుందన్నారు. మూడు ఏళ్లలో 31 కిలోమీటర్ల మెట్రో అందుబాటులోకి వస్తుందన్నారు. గచ్చిబౌలి మాదాపూర్ లో పని చేసే వాళ్లు శంషాబాద్ వరకు ఉండవచ్చన్నారు. నాగోల్ నుండి ఎల్బీనగర్, గచ్చిబౌలి నుండి లక్డికాపూల్ వరకు తాము మెట్రో చేపడతామని కేంద్రానికి లెటర్ రాస్తే అది ఫీజబుల్ కాదని కేంద్ర ప్రభుత్వం అంటుందన్నారు.
ఈ రోజే కేంద్రం నుండి సమాచారం వచ్చిందని.. ఇది చాలా బాధించదగ్గ విషయమన్నారు. ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఇస్తున్నారు ఇక్కడ మాత్రం ప్రయాణికులు లేరు అంటూ కేంద్రం చెప్పడం సరైంది కాదని తెలిపారు. హైదరాబాద్ నగరం కంటే చాలా చిన్న నగరాలకు డబ్బులు ఇచ్చి ఇక్కడ మాత్రం ఫీజుబులిటీ కాదు అనడం అసలు సరైనది కాదన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి చెందినట్లు కాదా హైదరాబాదు నుండి పన్నులు దేశానికి వెళ్లడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ నుండి కేంద్రానికి రూ.3.68 లక్షల కోట్లు వెళ్తే.. తెలంగాణకు మాత్రం రూ.1,68 వేల కోట్లు మాత్రమే వచ్చాయని వెల్లడించారు. తెలంగాణ, హైదరాబాద్ నగర అభివృద్ధికి కేంద్రం మద్దతు ఇవ్వాలని తాను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం సహకరించినా, సహకరిం