Lunar Eclipse: 300 ఏళ్ల త‌ర్వాత అరుదైన చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏం చేస్తే మంచిది?

Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం. ఈసారి ఏర్ప‌డేది మామూలు చంద్ర‌గ్ర‌హ‌ణం కాదు. దాదాపు 300 ఏళ్ల త‌ర్వాత ఏర్ప‌డి మ‌ళ్లీ రేపు రాబోతోంది. ఎందుకంటే ఫాల్గున పౌర్ణ‌మి రోజున ఉద‌యం పూట ఈ గ్ర‌హ‌ణం ఏర్ప‌డుతోంది. ఇదే రోజున ల‌క్ష్మీ దేవి పాల స‌ముద్రం నుంచి జ‌న్మించ‌ని పురాణాలు చెప్తున్నాయి. ఈ ప‌విత్ర‌మైన రోజున ఇంట్లో పూజ‌లు చేయ‌డం వ‌ల్ల మంచి జ‌రుగుతుంద‌ని జ్యోతిష్యులు చెప్తున్నారు.

ఏం చేయాలి?

*ఉద‌యం సూర్యోదయం కంటే ముందు నిద్ర‌లేచి స్నానాలు ఆచ‌రించి ఇంటిని తుడిచి ప‌సుపు నీళ్లు చ‌ల్లుకోవాలి. పూజా గ‌దిని కూడా శుభ్రం చేసుకోవాలి

*దేవుడి ఫోటోలు, విగ్ర‌హాల‌ను శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ‌ బొట్లు పెట్టాలి. పువ్వుల‌తో అలంక‌రించాలి.

*మ‌న సంప్ర‌దాయంలో పౌర్ణ‌మి ల‌క్ష్మీ దేవికి సంబంధించిన‌ది. కాబ‌ట్టి.. ఆ రోజున దేవుడి ఫోటోల‌కు గులాబీ లేదా ఇత‌ర పువ్వుల‌తో అలంక‌రిస్తే ఎంతో మంచిది.

*ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ప‌సుపు కుంకుమ రాసి పూజా గ‌దిలో ఉంచండి. ఒక ప్లేటులో చిన్న బెల్లం ముక్క కూడా వేసి ఉంచండి. మ‌నం పూజ చేసేట‌ప్పుడు అందులో ఉండే దైవ‌శ‌క్తి రాగి చెంబులోకి చేరుతుంది అంటారు. కాబ‌ట్టి పూజ అయ్యాక ఆ రాగి చెంబులోని నీటిని ఇంట్లో వారు సేవించాలి.

*తీర్థం తీసుకునేటప్పుడు ల‌క్ష్మీదేవిని స్మ‌రించుకోవాలి. పౌర్ణ‌మి రోజున ఇంట్లో పూజ చేస్తే ఆ ఇంట పాపాలన్నీ తొల‌గిపోతాయ‌ని అంటారు.

*పౌర్ణ‌మి రోజున తుల‌సి మొక్క‌ను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి క‌టాక్షం ఉంటుంది. సాయంత్రం నెయ్యితో దీపం వెలిగిస్తే ఎంతో మంచిది.

*ఈ పౌర్ణ‌మి రోజున విష్ణువును ఆరాధించ‌డం కూడా ఎంతో ముఖ్యం. విష్ణువు ఇష్ట‌మైన వాటిలో ప‌సుపు ఒక‌టి కాబ‌ట్టి స్నానపు నీటిలో చిటికెడు ప‌సుపు వేసి స్నాన‌మాచ‌రిస్తే మంచిది.

*పూజ చేస్తున్న స‌మ‌యంలో అక్షింత‌లు చేతిలో పెట్టుకుని చేయండి. పూజ అయ్యాక ఆ అక్షింత‌ల‌ను త‌ల‌పై వేసుకోండి. అలాగే విష్ణు స‌హ‌స్ర‌నామ పారాయ‌ణం చేస్తే మ‌రీ మంచిది.

*కొంత‌మంది ప‌లు కార‌ణాల వ‌ల్ల‌ వారంలో ఒక‌సారి మాత్ర‌మే పూజ చేస్తుంటారు. ఇలాంటివారు పౌర్ణ‌మి రోజున నెయ్యితో దీపం పెడితే రోజూ పూజ చేసిన ఫ‌లితం ద‌క్కుతుంది.

*పౌర్ణ‌మి రోజున న‌లుపు రంగులో ఉండే దుస్తులు అస్స‌లు వేసుకోవ‌ద్దు