Raja Saab: జ‌స్ట్ అలా ఎంట్రీ ఇచ్చాడంతే..

prabhas swag look in raja saab teaser is mesmerising

Raja Saab: ప్రభాస్‌, మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న ‘రాజా సాబ్‌’ ‘ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్’ పేరుతో స్పెషల్‌ వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో డైలాగులు లేవు. ప్రభాస్ లుక్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ పైనే ఫోకస్ పెట్టారు మారుతి. ప్రభాస్ ఓ కారు దిగి స్టయిల్ గా నడిసోస్తూ అద్దంలో తన మొహాన్ని చూసుకొని స్వయంగా దిష్టి తీసుకోవడం సరదాగా వుంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ ఓ క్లాస్‌లుక్‌లో కనిపించారు. ఆ సూట్ కోట్ అచ్చు రాజా సాబ్ లానే వున్నారు. తమన్‌ మ్యూజిక్ క్యాచిగా వుంది. ఇందులో సినిమా జోనర్‌ని రివిల్ చేశారు. ఇదొక హారర్‌, రొమాంటిక్‌, కామెడీ సినిమా. ఏప్రిల్‌ 10, 2025న ‘రాజా సాబ్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.