సీఎం ప్ర‌చారంలో ముద్దులాట‌.. వీడియో వైర‌ల్

సీఎం ప‌క్క‌న ఉండ‌గానే.. వంద‌లాది మంది చూస్తున్నా.. మీడియా క‌ళ్లు వారిపైనే ఉన్నాయ‌ని తెలిసీ ఓ జంట రొమాన్స్ చేసుకుంటూ దొరికిపోయింది. ఈ ఘ‌ట‌న క‌రెక్ట్‌గా ఎక్క‌డ జ‌రిగిందో తెలీదు కానీ బీఆర్ఎస్ పార్టీ నేత స‌తీష్ రెడ్డి త‌న ట్విట‌ర్ నుంచి ఈ వీడియోను షేర్ చేసారు. వీడియోలో మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఏక‌నాథ్ శిందే ఏదో క్యాంపెయిన్‌లో పాల్గొన్న‌ట్లు క‌నిపిస్తోంది. శిందే ప్ర‌జ‌ల‌తో మాట్లాడుతూ.. అంద‌రినీ ప‌ల‌క‌రిస్తుంటే.. ఆయ‌న ప‌క్క‌న ఉన్న ఓ వ్య‌క్తి మాత్రం ఇవేవీ ప‌ట్ట‌న‌ట్లు ఏదో గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో ట్రిప్‌కి వ‌చ్చిన‌ట్లు.. వెన‌క ఉన్న మ‌హిళతో రొమాంటిక్‌గా మాట్లాడుతూ క‌నిపించారు. అంతేకాదు.. ఆ మ‌హిళ అత‌నికి బుగ్గ‌పై ముద్దు కూడా ఇచ్చింది. స‌తీష్ రెడ్డి ఈ వీడియో షేర్ చేయ‌డంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌ను ఈడీ లిక్క‌ర్ స్కాంలో విచార‌ణ చేప‌డుతున్న తరుణంలో బీజేపీ నేత బండి సంజ‌య్ లిక్కర్ స్కాంలో ఇరుక్కుంటే అరెస్టు చేయ‌క పిలిచి ముద్దుపెట్టుకుంటారా అంటూ అనుచిత వ్యాఖ్య‌లు చేసి ఇరుక్కున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు స‌తీష్ రెడ్డి షేర్ చేసిన ఈ వీడియోపై బీఆర్ఎస్ నేత‌లు బీజేపీని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. బండి సంజ‌య్ బ‌హుశా ఈ వీడియో చూసే క‌విత‌పై ఆ కామెంట్లు చేసి ఉంటారని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై ఏక‌నాథ్ శిందే, బీజేపీ ఏమ‌ని స‌మాధాన‌మిస్తాయో చూడాలి మ‌రి.