Lunar Eclipse: చంద్రగ్రహణం.. ఈ రాశుల వారికి ఊహించని రాజయోగం
Lunar Eclipse: రేపు (మార్చి 25)న వచ్చే చంద్రగ్రహణం మామూలు గ్రహణం కాదు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చిన గ్రహణం ఇది. మన భారతదేశం కాలమానం ప్రకారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 – 4:30 వరకు చంద్రగ్రహణం ఉంటుంది. దీనిని కేతు గ్రస్త చంద్రగ్రహణం అంటారు. ఇది మన భారతదేశంలో మనకు కనపడదు. ఎందుకంటే మనకు ఉదయం ఏర్పడుతుంది కాబట్టి సంపూర్ణ చంద్రుడు కనిపించదు. ఇది మన దేశంలో కనపడదు కాబట్టి మనకి గ్రహణ నియమాలు వర్తించవు. మరి ఎక్కడ కనిపిస్తుంది అంటే.. యూరప్ దేశాలలో, అమెరికా.. ఇతర దేశాలలో కనిపిస్తుంది.
మనకు చంద్రగ్రహణం వర్తిస్తుందా?
మనకి వర్తించదు. అంటే.. నియమాలు వర్తించవు అని అర్థం. దేవలయాలు మూసేయడం, ఆహార పదార్థాలపై దర్బాలు పెట్టడం, తినకుండా ఉండటాలు ఇవేమీ మనకు వర్తించవు. అందరూ తినచ్చు, పూజలు చేసుకోవచ్చు. (Lunar Eclipse)
మరి ఎవరికి వర్తిస్తుంది?
అమెరికాలో ఉంటున్న హిందువులకు వర్తిస్తుంది. గ్రహణం అందరికీ కనిపించినా కనిపించకపోయినా గర్భిణులకు మాత్రం కచ్చితంగా నియమాలు వర్తిస్తాయి.
ఏ రాశుల వారికి బాగోలేదు?
అయితే.. మన దేశంలో గ్రహణం కనిపించకపోయినా గ్రహణ ప్రభావం మాత్రం ఈ రాశులపై తప్పకుండా ఉంటుంది. ఈ చంద్రగ్రహణం వల్ల అధిక ప్రభావం చూపే రాశి ఏదంటే.. కన్య. ఎందుకంటే ఈ సారి గ్రహణం కన్యా రాశిలోని హస్తా నక్షత్రంలో ఏర్పడుతోంది. ఇది కన్యా రాశి వారికి అరిష్టం. తుల రాశి వారిపై కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తుల రాశి వారికి 12వ స్థానంలో ఈ గ్రహణం పట్టబోతోంది. వీరికి ఖర్చులు అధికం అవుతాయి. మానసిక ఒత్తిళ్లు ఎక్కువ అవుతాయి. ఉద్యోగాలు కోల్పోతారు. స్థాన మార్పులు ఉంటాయి. ఇవన్నీ జరగడం వల్ల చాలా ఒత్తిడికి గురవుతారు. వీరు అరిష్ట నివారణ యాగం చేసుకుంటే మంచి జరుగుతుంది. కుంభ, మిథున రాశుల వారికి కూడా ఈ గ్రహణం మంచిది కాదు. వీరికి ఆల్రెడీ ఏలినాటి శని ఉంది. గురుబలం లేదు. శనిగ్రహ బలం కూడా లేదు.
ఏ రాశుల వారికి మంచిది?
ఈసారి చంద్రగ్రహణం వల్ల ఈ ఆరు రాశుల వారికి రాజయోగం పట్టబోతోంది. సప్తమ స్థానంలో ఈ గ్రహణం పడితే ఆ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. ఆ రాశులేంటంటే.. మీన, మేష, వృశ్చిక, ధనస్సు.