Online dating: 7000 మంది బాయ్‌ఫ్రెండ్స్!
California: ఓ యువతి ఏకంగా 7000 మంది బాయ్‌ఫ్రెండ్స్‌ని మెయింటైన్ చేస్తోంది(online dating). అది కూడా ఆన్‌లైన్ డేటింగ్(online dating) ద్వారా. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియాకు చెందిన నాలా రే అనే 25 ఏళ్ల యువతి బాగానే సంపాదిస్తోంది. మోడల్ లుక్స్‌తో ఉన్న నాలా.. నెలకు దాదాపు రెండున్నర కోట్లు సంపాదిస్తుంది. నాలా తన డబ్బు, అందం చూసి కాకుండా తన మనసు చూసి వచ్చే అబ్బాయితో డేటింగ్ చేయాలని అనుకుంది. కానీ అలాంటివారు ఎవరూ తనకు రియల్ లైఫ్‌లో కనిపించలేదు. దాంతో ఆన్‌లైన్ డేటింగ్ ఆప్షన్ ఎంచుకుంది. అలా ఏకంగా ఒకేసారి 7000 మంది బాయ్‌ఫ్రెండ్స్‌ని మెయింటైన్ చేస్తోంది. అలాగని వారిని డబ్బు కోసమో మరో సుఖం కోసమో వాడుకోవడంలేదు. రోజూ వారితో మాట్లాడుతుంది. వారికేమైనా అవసరం ఉంటే తనే సాయం చేస్తుంటుంది. ఈ రకంగా తాను వారితో సంతోషంగానే ఉన్నానని అంటోంది. రియల్ లైఫ్ బాయ్‌ఫ్రెండ్స్ అయితే తన అందం, డబ్బు చూసి వాడుకోవాలనే అనుకుంటారని అందుకే ఆన్‌లైన్ డేటింగ్ ఎంచుకున్నానని అంటోంది.