Rajinikanth కమ్మనా..? గూగుల్ టాప్ సెర్చ్‌లో ఇదే హాట్ టాపిక్
Hyderabad: సూపర్‌స్టార్ రజినీకాంత్(rajinikanth) కులం ఏంటి? ఆయన కమ్మనా? గూగుల్ సెర్చ్(google search) ఇంజిన్‌లో ఇదే టాప్‌లో ఉంది. నిన్న కృష్ణా జిల్లాలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల (ntr centenary celebrations) సభకు రజనీకాంత్ (rajinikanth) ముఖ్యఅతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. సినీ నటుడు బాలకృష్ణ(balakrishna) ఆయన్ను స్వయంగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో రజినీ మాట్లాడుతూ.. టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ప్రశంసించారు. ఎన్టీఆర్ యుగపురుషుడైతే.. చంద్రబాబు విజనరీ అని ఆయన అన్నారు. చంద్రబాబు రూపొందించిన విజన్-2047 ప్రణాళిక అమలైతే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్లిపోతుందని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఇదివరకు ఎవ్వరి గురించీ అలా మాట్లాడని తలైవా.. ఇప్పుడు చంద్రబాబు గురించే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ఏ కులమో తెలుసుకోవడానికి గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారట. రజినీ కమ్మ కులానికి చెందినవారని అందుకే చంద్రబాబుని ఆకాశానికెత్తేస్తున్నారని మండిపడుతున్నారు. మరోపక్క వైసీపీ నేతలు కొడాలి నాని, రోజా రజినీపై తీవ్ర విమర్శలు చేసారు.