karnataka: చీరల కోసం మహిళలు ఇలా కొట్టుకున్నారేంటి.. నిజమా? ఫేకా?

bengaluru: చీరలంటే(sarees).. మహిళల(womens)కు ఎంతో ఇష్టం. ఇది అందరికీ తెలిసిన నిజమే. ఇక వాటి కోసం కొట్టుకునే మహిళలను కూడా చాలా సందర్బాల్లో చూసి ఉంటాం. ఇక తాజాగా ఇలాంటి సంఘటనే కర్నాటక(karnataka) రాజధాని బెంగళూరు(bengaluru)లో జరిగింది. స్థానిక మల్లేశ్వరం ప్రాంతంలో ఉండే మైసూరు సిల్క్‌ శారీ సెంటర్‌(mysore silk saree center) షాపు యాజమాన్యం ఇయర్‌ ఎండింగ్‌ సేల్స్‌ పేరుతో ఇటీవల భారీగా రాయితీ(discounts)లు ప్రకటించింది. అందులో కూడా చీరలపై ప్రత్యేక రాయితీ ఇవ్వడంతో వాటిని కోనుగోలు చేసేందుకు మహిళలు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఈక్రమంలో తాజాగా ఓ ఇద్దరు మహిళలు షాపింగ్ కోసం వచ్చి ఒకే చీర కోసం కొట్టుకున్నారు.

బయట మార్కెట్ కంటే తక్కువ ధరకు చీరలు వస్తుండటంతో మైసూర్‌ శారీ సిల్క్‌ సెంటర్‌కు మహిళలు పోటెత్తారు. ఈక్రమంలో ఇకే చీర ఇద్దరికీ నచ్చడంతో.. నాకు కావాలంటే నాకే కావాలని అంటూ పంతం పట్టారు. ఈ విషయంలో తగ్గదేలే అన్నట్టుగా ఇద్దరూ వ్యవహరించారు. చివరికి ఇద్దరి మధ్య గొడవ మరింతగా ముదరడంతో జుట్టు పట్టుకుని మరి కొట్టుకున్నారు. మధ్యలో పోలీసులు కలగజేసుకుని గొడవను ఆపారు. షాపింగ్ కోసం వచ్చిన మిగతా మహిళలు మాత్రం.. వారి గురించి పట్టించుకోకుండా.. చీరలు కొనే హడావిడిలో ఉన్నారంటే.. చూడండి ఆ చీరలపై మహిళలు ఎంత మోజుపడుతున్నారో.

మహిళలు కొట్టుకున్న వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఒక్క చీర కోసం ఎంతకైనా తెగిస్తారా బాబోయ్ అంటూ షాక్ అవుతున్నారు. ఆన్ లైన్ లోనే ఆఫర్లు పెట్టొచ్చు కదా అని మరి కొంతమంది సలహా ఇస్తున్నారు. ఇక మరికొంతమంది షాపులో చీరలకు ఎంత డిమాండ్ వుందో చెప్పేందుకే ఈ వీడియోను సోషల్ మీడియాలో ప్రకటనగా రిలీజ్ చేసి ఉంటారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.