RCB గెలిచేవ‌ర‌కు నో స్కూల్..!

Hyderabad: ఐపీఎల్(ipl) మొద‌లైన ఇన్నేళ్ల‌లో.. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(royal challengers banglore)కు ఒక్క‌సారైనా ట్రోఫీ ద‌క్కింది లేదు. క‌నీసం ఈ ఏడాదైనా క‌ప్పు కొట్ట‌క‌పోదా అని ఫ్యాన్స్ వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ ప్ర‌తి సంవ‌త్స‌రం ఈ సాల క‌ప్ న‌మ‌దే అనుకోవ‌డం.. ఆ టీం గెల‌వ‌క‌పోవడం.. మ‌రుస‌టి సంవ‌త్స‌ర‌మైనా గెలుస్తార‌ని ఆశ‌ప‌డటం. ఇదే తంతు న‌డుస్తోంది. అయితే.. ఈ సీజ‌న్‌లో మాత్రం ఆర్సీబీ క‌ప్ గెలిచి తీరాల్సిందే అంటోంది . ఓ చిట్టిత‌ల్లి. కింద వీడియోలో క‌నిపిస్తున్న బుడ్డిది ఆర్సీబీకి వీరాభిమానేమో. ఈసారి మాత్రం క‌ప్ గెల‌వాల్సిందేన‌ని, క‌ప్ గెలిచేవ‌ర‌కు స్కూల్‌కి వెళ్లేదేలేదు అని రాసున్న ప్ల‌కార్డును ప‌ట్టుకున్న వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను గిల్ అనే ఓ డాక్ట‌ర్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేసాడు. అయితే ఇలాంటివి ఓ ప‌క్క కామెడీగానే ఉన్న‌ప్ప‌టికీ స్కూల్‌కి వెళ్ల‌క‌పోతే చాయ్ అమ్ముకోవాల్సిన ప‌రిస్థితి ఎదురవుతుంద‌ని ఓ చిన్న వీడియోను షేర్ చేసారు గిల్.