Australia: హైదరాబాద్ మహిళ దారుణ హత్య

Australia: ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్యకు గురైంది. మృతురాలు చైతన్య మాధగాని అలియాస్ (శ్వేత)గా పోలీసులు గుర్తించారు. ఆస్ట్రేలియాలోని బక్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు సమీపంలో ఉన్న ఓ చెత్త డబ్బాలో చైతన్య మాధగాని మృతదేహం ల‌భించింది. విక్టోరియా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చైతన్యకు అశోక్ రాజ్‌తో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అశోక్ చైత‌న్య‌తో గొడ‌వ‌ప‌డి ఆమెను చంపి చెత్త బుట్ట‌లో ప‌డేసి హుటాహుటిన కుమారుడితో ఇండియాకు తిరిగి వచ్చేసిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు.