NRI: అమెరికాలో తెలుగు యువ‌కుడి దారుణ హత్య‌

Ohio: అమెరికాలో(america) తెలుగు యువ‌కుడు(telugu nri) దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ఓహాయోలోని(ohio) ఓ గ్యాస్ స్టేష‌న్‌లో ప‌నిచేస్తుండ‌గా.. దుండుగులు కాల్పులు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. దాంతో అత‌ను అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. ఆ యువ‌కుడు మాస్ట‌ర్స్ కంప్లీట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. పార్ట్ టైం జాబ్ కోసం గ్యాస్ స్టేష‌న్‌లో ప‌నిచేస్తున్నాడ‌ట‌. గ్యాస్ స్టేష‌న్ల‌లో ఉద్యోగాలు రిస్క్ అని తెలిసీ అక్క‌డే ఉద్యోగాలు వెతుక్కుంటున్నార‌ట‌. మృతుడు స‌యేష్ వీరా అనే 24 ఏళ్ల యువ‌కుడిగా గుర్తించారు.