న్యూజెర్సీలో తెలుగు NRI పాడుప‌ని.. వేశ్య‌ను పొడిచి..

New Jersey: అమెరికాలోని(America) న్యూజెర్సీ(new jersey) రాష్ట్రంలో తెలుగు యువ‌కుడు పాడుప‌ని చేసి పోలీసులకు చిక్కాడు. రావూరి వినీత్(ravuri vineeth) అనే యువ‌కుడు కొంత‌కాలంగా న్యూజెర్సీ(new jersey)లో ఉంటున్నాడు. చెడు అల‌వాట్ల‌కు బానిస అయిన వినీత్.. ఓ వేశ్య‌తో బేరం మాట్లాడుకుని హోట‌ల్ బుక్ చేసుకున్నాడు. ఇందుకు అత‌ను చాలా డాల‌ర్లు చెల్లించాడు. అయితే హోట‌ల్‌కి వ‌చ్చిన యువ‌తి అత‌నితో సెక్స్‌కు ఒప్పుకోలేదు. దాంతో కోపంతో రగిలిపోయిన వినీత్ ఇచ్చిన డ‌బ్బు తిరిగివ్వాల‌ని గొడ‌వ‌చేసాడు. ఆమె ఇవ్వ‌ను అని చెప్ప‌డంతో క‌త్తితో పొడిచేందుకు య‌త్నించాడు. ఈ గొడ‌వ‌లో యువ‌తి త‌ప్పించుకోవాల‌ని చూసింది. ఆమె వెనుక భాగం, చేతుల‌కు తీవ్ర‌గాయాలు అయ్యాయి. గ‌ట్టిగా కేక‌లు వేయడంతో హోట‌ల్ సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఇలాంటి విష‌యాల్లో అమెరికా(america) పోలీసులు చాలా క‌ఠినంగా ఉంటారు. వినీత్‌ను అదుపులోకి తీసుకున్నారు.