Telangana మణిహారం.. అమరజ్యోతి స్తూపం..!
Hyderabad: హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన తెలంగాణ(telangana) అమరవీరుల త్యాగాన్ని గుర్తుకు తెచ్చేలా.. అమరజ్యోతి(amarajyoti) నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే దాదాపు పనులు పూర్తి చేసుకుని .. వచ్చే నెల(జూన్ 2న) ప్రారంభానికి సిద్దమైంది. అదే రోజు తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం కావడంతో.. కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్మారక చిహ్నాన్ని ప్రారంభించనున్నారు. అసలు ఈ స్మారక చిన్నం నిర్మాణం వెనుక ఉన్న నేపథ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది యువకులు, మేధావులు బలిదానాలు చేశారు. దీంతో వారి త్యాగాలకు గుర్తుగా అమరజ్యోతి పేరుతో హుస్సేన్‌సాగర్ తీరంలో స్మారక కట్టడాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిర్విస్తోంది. ఇది పూర్తి అధునాతన సాంకేతికతతోపాటు.. స్టెయిన్లెస్ స్టీల్‌తో నిర్మిస్తున్నారు. భవిష్యత్ తరాలకు తెలంగాణ పోరాట యోధుల గురించి తెలిసేలా.. నాటి చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. అమర జ్యోతి.. పేరులాగే.. ఇక్కడ 365 రోజలపాటు స్మారక చిహ్నం కట్టడంపైన జ్యోతి వెలిగేలా నిర్మాణం చేస్తున్నారు.
ఈ స్మారకాన్ని అయిదు అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. దాదాపు 42 మీటర్ల ఎత్తులో.. నిర్మితమవుతున్న స్మారకంపైన దీపాకృతిలో తీర్చిదిద్దుతున్నారు. తొలి రెండు అంతస్తులు పార్కింగ్‌కు కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో తెలంగాణ మ్యూజియం, ఫొటో గ్యాలరీ, ఆడియో విజువల్స్ రూమ్‌లు ఉంటాయి. ఇక్కడ రాష్ట్ర సాధన చరిత్ర.. తెలంగాణ పోరాట యోధుల గురించి తెలియజేయనున్నారు. అందుకోసం అత్యాధునిక లైబ్రరీ.. నాలుగో ఫోర్లో కన్వెన్షన్ హాల్, అయిదో అంతస్తులో రెస్టారెంట్‌తోపాటు.. సాగర్ తీరాన్ని వీక్షించేలా.. వ్యూ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. సుమారు నాలుగు ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న అమరజ్యోతి పనులు పూర్తి కావస్తున్నాయి. ఇక స్మారకం ఉన్న ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణన్ని అందిచేందుకు పచ్చని మొక్కలను పెంచుతున్నారు.