Mother’s Day: అమ్మలకు ఈ కానుకలు ఇచ్చి చూడండి..!
Hyderabad: ఈరోజు మదర్స్ డే(mothers day). అమ్మ(mother) మీదున్న ప్రేమను ఒక్కరోజులో వ్యక్తపరచలేం అనుకోండి. వారితో గడిపే ప్రతి క్షణం మధురంగానే ఉంటుంది. ఏదేమైనా.. ఈరోజు మదర్స్ డే కాబట్టి.. అమ్మలను సర్‌ప్రైజ్ చేయాలనుకునేవారి కోసం ఈ ఐడియాలు.
ఫొటో ఫ్రేమ్స్
మీ అమ్మకు ఎంతో ప్రత్యేకమైన రోజులను గుర్తు చేసేలా ఫొటోలు మీ దగ్గర ఏమన్నా ఉంటే వాటిని ఓ కొలాజ్‌లా చేసి ఫ్రేమ్ కట్టించి ఇవ్వండి. ఎంతో సంతోషిస్తారు.
వండి పెట్టండి
రోజూ అమ్మే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కమ్మగా వండి పెడుతుంటుంది. కనీసం మదర్స్ డే రోజైనా అమ్మకు నచ్చిన వంటను వండిపెట్టండి. అసలు ఆరోజు అమ్మను వంటింట్లోనే రానివ్వకండి!
డేట్‌కి తీసుకెళ్లండి
డేటింగ్ అంటే అమ్మాయి, అబ్బాయితోనే కాదు. మనకెంతో దగ్గరైన వారు ఎవరితో వెళ్లినా మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. మదర్స్ డే రోజున అమ్మను తనకు ఇష్టమైన ప్రదేశానికి తీసుకెళ్లండి. ఆరోజంతా ఆమెతో గడిపి చూడండి.
జ్యువెలరీ
ఏదైనా జ్యువెలరీ కానుకగా ఇద్దామనుకున్నవారు రొటీన్‌గా కాకుండా.. అమ్మ పేరు లేదా.. అమ్మానాన్నల ఫొటో కనిపించేలా కస్టమైజ్డ్ జ్యువెలరీని కానుకగా ఇవ్వండి. ఎంతో హ్యాపీగా ఫీలవుతారు.