Summer: భానుడి భ‌గ‌భ‌గ‌లు..అల్లాడుతున్న AP వాసులు

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో భానుడు(summer) భగభగ మండుతున్నాడు. ఎండల ధాటికి ప్రజలు అల్లాడుతున్నారు. APలోని అనేక జిల్లాలో రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదయ్యింది. ఇక విజయవాడలో(vijayawada) 45 డిగ్రీలు నమోదయ్యింది. దీంతో ప్రజలు బయటకు రాలేకపోయారు. ఎండతోపాటు వేడిగాలుల వల్ల బస్సులు, ఇతర వాహనాల్లో ప్రయాణించడానికి ఇబ్బంది పడ్డారు. మొచా తుఫాన్ కారణంగా మరో రెండు మూడు రోజులు ఎండల తీవ్రత ఇదే విధంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక ఏపీలోని దాదాపు 153 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఇవాళ టెంపరేచర్ ఇలా నమోదయ్యాయి.. గుంటూరులో(guntur) ఏకంగా 48 డిగ్రీలు, విజయవాడ 45, అనంతపురం 44, వైజాగ్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని ఆదిలాబాద్ కొండాపూర్లో 45.9 అత్యధికంగా.., హైదరాబాద్లో 40 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది. ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రావాలని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికీ అనేక మంది వడగాలులతో అవస్థలు పడుతున్నారు.