Jiah Khan: నటి సూసైడ్ కేసు.. హీరోని నిర్దోషిగా తేల్చిన కోర్టు
Mumbai: బాలీవుడ్ నటి జియా ఖాన్(jiah khan) ఆత్మహత్య కేసులో ఈరోజు తుది తీర్పు వెల్లడైంది. ముంబైలోని ప్రత్యేక సీబీఐ(cbi) కోర్టు తీర్పు వెల్లడిస్తూ.. అనుమానితుడిగా ఉన్న నటుడు, జియా బాయ్‌ఫ్రెండ్ సూరజ్ పంచోలీ(suraj pancholi)ని నిర్దోషిగా తేల్చింది. 2013 జూన్ 3న జియా ఖాన్ ముంబైలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటికే జియా, బాలీవుడ్ నటుడు సూరజ్ పంచోలీ ప్రేమలో ఉన్నారు. దాంతో సూరజ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని జియా తల్లి రాబియా ఖాన్ కూడా కేసు పెట్టారు. ఈ కేసులో భాగంగా ఇప్పటివరకు పోలీసులు 22 మందిని విచారించారు. ఆత్మహత్య చేసుకున్నప్పుడు జియా గర్భవతి అని, అబార్షన్ చేయించుకోవాలని సూరజ్ బలవంతం చేసినా జియా ఒప్పుకోలేదని రాబియా వాదించారు. అందుకే కడుపులో బిడ్డను తల్లి నుంచి బలవంతంగా వేరు చేయాలని యత్నించడంతో జియా చనిపోయిందని అన్నారు. సీబీఐ విచారణలో జియా ఆత్మహత్య చేసుకోవడం వల్లే చనిపోయారని తేలిందని ఎక్కడా హత్యకు గురైనట్లు అనుమానాలు కూడా లేవని తేలింది. సూరజ్‌తో బ్రేకప్ అయ్యాక రిలేషన్‌షిప్ ముగిస్తున్నట్లు జియా సూరజ్‌కి బొకే పంపిందని అన్నారు. అయితే సూరజ్‌పై ఉన్న ఆరోపణల ఆధారంగా విచారించినప్పటికీ సరైన ఆధారాలు లేకపోవడంతో ఆయన్ని నిందితుడిగా పరిగణించేమని న్యాయవాది తెలిపారు. దాంతో రాబియా హైకోర్టులో కేసు వేస్తానని అన్నారు.