SIP: పెళ్లికి డబ్బుల్లేవా.. అయితే ఇది మీకోసమే!
SIP: ఈరోజుల్లో పెళ్లి చేయాలంటే మాటలు కాదు. చేతిలో ఒక 30 లక్షలు ఉంటేనే కాస్త గ్రాండ్‌గా పెళ్లి చేయగలుగుతున్నారు. పెళ్లికి వృథా ఖర్చు ఎందుకు అనుకునేవారు సింపుల్‌గా కానిచ్చేస్తున్నారు. ఇక డబ్బున్న వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల అంబానీ ఇంట జరిగిన వేడుకను అందరం చూసాం. చాలా మందికి డెస్టినేషన్ పెళ్లిళ్లు చేసుకోవాలని ఉంటుంది. కానీ చేతిలో డబ్బు ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలి? డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకునేవారి కల ఎలా నెరవేరుతుంది? సరిగ్గా ఇలాగే ఆలోచించింది ముంబైకి చెందిన ఓ కంపెనీ. (SIP)
డెస్టినేషన్ పెళ్లిళ్లు చేసుకోవాలనుకుని చేతిలో డబ్బుల్లేక ఇబ్బందిపడుతున్నవారి కలను నెరవేర్చేందుకు SIPని ప్రవేశపెట్టింది. ఈ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్ ప్లాన్ గురించి మీరు కూడా వినే ఉంటారు కదా..! రూ.11000 నుంచి రూ.45000 వరకు ఈ ప్లాన్ ద్వారా సేవింగ్స్ చేసుకోవచ్చు. అయితే ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఎంత ఉంటుంది? ఎంత రాబడి వస్తుంది వంటి వివరాలు మాత్రం తెలియరాలేదు. ఎందుకంటే ఆ కంపెనీ పెట్టిన ఈ యాడ్‌ను ఓ సోషల్ మీడియా యూజర్ ఫోటో తీసి ట్విటర్లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. ఎలాంటి మోసం లేకుండా సమయానికి డబ్బులు ఇస్తాం అంటే తప్పకుండా పెట్టుబడి పెడతాం అని ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు కావాలని చాలా మంది నెటిజన్లు రిక్వెస్ట్ పెడుతున్నారు. ఈ ప్లాన్ గురించి మీరేమంటారు?