same sex marriages: లీగల్ చేయకూడదని సుప్రీంను కోరిన కేంద్రం
Delhi: గే మ్యారేజీలను(same sex marriages) లీగల్ చేయకూడదని కేంద్రం సుప్రీం కోర్టును(supreme court) కోరింది. ఇలాంటి పెళ్లిళ్లలను(Same sex marriages) లీగల్ చేయడమనేది భారత సంప్రదాయం కాదని, అది వెస్ట్రన్ కల్చర్ అని తెలిపింది. అసలు ఈ పిటిషన్ ఏంటంటే.. భారత్‌కు చెందిన పలువురు స్వలింగ సంపర్కులు తమకు కూడా సాధారణ దంపతులకు కల్పించే అన్ని హక్కులు, వెసులుబాట్లు కల్పించాలని సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేసారు. అలా ఎన్నో పిటిషన్లు రావడంతో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీం న్యాయమూర్తులు నిర్ణయించారు. ఈ పిటిషన్‌ను పరిశీలించడానికి రాజ్యాంగ హక్కులు, ట్రాన్స్‌జెండర్ల హక్కులను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ పిటిషన్‌పై సుప్రీం రేపు తీర్పు వెలువరించనుంది. యావత్ భారతదేశం ఈ తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో సేమ్ సెక్స్ పెళ్లిళ్లలను లీగల్ చేయకూడదని కేంద్రం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది.