Rishi sunak: మహిళలకు పురుషాంగాలు ఉండవు
Britain: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(rishi sunak) కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన చేస్తున్న మంచి పనుల కంటే.. వైరల్ కామెంట్లకే వార్తల్లోకెక్కుతున్నారు. తాజాగా ఆయన ఈక్వాలిటీపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం బ్రిటన్ లేబర్ పార్టీ లీడర్ కీర్ స్టార్మర్ ఓ అసభ్యకర కామెంట్ చేసారు. 99.9 శాతం మహిళలు పురుషాంగం కలిగి ఉండరు అన్నారు. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో రిషి సునాక్(rishi sunak) మాట్లాడారు.
“ఈ విషయంలో నాకు వేరే అభిప్రాయాలు ఉన్నాయి. 100% శాతం మహిళలు పురుషాంగం కలిగి ఉండరు. లింగం విషయంలో మనం కాస్త సెన్సిటివ్‌గా వ్యవహరించాలి. మనం మహిళలకు హక్కులు, భద్రత ప్రథమ హక్కులుగా భావిస్తున్నప్పుడు బయోలాజికల్ సెక్స్ అనేది కూడా ప్రథమ హక్కుగా భావించాలి. జెండర్ చట్టాల విషయంలో బ్రిటన్ ప్రభుత్వంలో మార్పులు తీసుకొస్తాను. మా ప్రభుత్వం ఒక నిర్దిష్ట లింగానికి జన్మించిన వ్యక్తి మరియు లింగ మార్పిడికి గురైన వారి మధ్య వ్యత్యాసం ఉన్న చట్టాన్ని పరిశీలిస్తోంది” అని తెలిపారు. సింపుల్ భాషలో చెప్పాలంటే.. లింగ మార్పిడి చేయించుకోకుండా ట్రాన్స్‌జెండర్ అని చెప్పుకంటే వారిని మహిళల క్యాటగిరీలో చేర్చలేరు. ట్రాన్స్‌జెండర్ అంటే వారు తప్పనిసరిగా సర్జరీ చేయించుకోవాల్సిందే. అప్పుడే వారిని ఫీమేల్ జెండర్‌గా భావిస్తారు.
అసలు ఈ డిబేట్ ఎందుకు వచ్చిందంటే.. గతేడాది స్కాట్‌లాండ్‌లో ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఇద్దరు మహిళలను దారుణంగా రేప్ చేసాడు. కాకపోతే అప్పటికే అతను లింగమార్పిడి చేయించుకోకుండా ట్రాన్స్‌జెండర్‌నని పోలీసులకు చెప్పుకున్నాడు. ఈ విషయాన్ని అతను కోర్టులో చెప్పడంతో అతన్ని మహిళా ఖైదీలు ఉండే జైలుకే తరలించారు. అయితే అతను ట్రాన్స్‌జెండర్ అయినప్పటికీ అమ్మాయిలను రేప్ చేసాడంటే.. ఖైదీలుగా ఉన్న ఇతర మహిళలపై కూడా అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం ఉందని స్కాట్‌లాండ్ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో జెండర్ చట్టాలకు సంబంధించి బ్రిటన్ ప్రభుత్వం మార్పులు తీసుకొస్తోంది.