Ram Gopal Varma: వివేకా హత్యపై వర్మ సంచలన కామెంట్స్
Hyderabad: దివంగత ఎంపీ వివేకానంద రెడ్డి(viveka murder case) హత్య కేసుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ram gopal varma) సంచలన కామెంట్స్ చేసారు. ఈ కేసుపై ఇప్పటికే సీబీఐ వేగంగా విచారణ చేపడుతోంది. ఈ నేపథ్యంలో వర్మ కేసు గురించి స్పందిస్తూ.. తాను నిజం పేరుతో ఓ యూట్యూబ్ చానెల్‌ను లాంచ్ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు. “నేను ప్రారంభించబోయే”నిజం” యూట్యబ్ ఛానల్ ముఖ్య ఉద్దేశం అబద్ధాల బట్టలూడదీయడానికి.. ఆ బట్టలూడదీసి విసిరి పారెస్తేనే, నిజం యొక్క పూర్తి నగ్న స్వరూపం బయటపడుతుంది. వివేకా మర్డర్ వెనక నిజంలోని అబద్ధాలు,ఆ అబద్ధాలు చెప్పే వాళ్ళ వెనక ఉన్న నిజాలు,ఆ నిజాల వెనక వేరే వాళ్ళు ప్రభోధిస్తున్న అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్ళ పైవాళ్లు అందరి నెత్తి మీద రుద్దుతున్న నిజమైన అబద్ధాలు ,వాటన్నింటి వెనుక నిజాలన్నింటినీ తవ్వి తీయడమే “నిజం” ఛానల్ ముఖ్య ఉద్దేశం. నిజం నివురు కప్పిన నిప్పు లాంటిది.. ఎప్పుడో అప్పుడు మంటగా మారి అబద్దాన్ని కాలుస్తుంది.. నిజం” చానల్ 1st ఎపిసోడ్ “వివేకా హత్య వెనక నిజంలో అబద్దముందా? అని ట్వీట్ చేసారు వర్మ.