AR Rahman లైవ్ పెర్ఫామెన్స్.. అడ్డుకున్న పోలీసులు

Pune: ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్, సింగ‌ర్ ఏ.ఆర్ రెహ‌మాన్(ar rahman) లైవ్ పెర్ఫామెన్స్‌ను అడ్డుకున్నారు పుణె(pune) పోలీసులు. నిన్న రాత్రి రెహ‌మాన్(rahman) కాన్స‌ర్ట్ పుణెలో జ‌రిగింది. రాత్రి 10 దాటిన త‌ర్వాత కూడా కాన్స‌ర్ట్ జ‌రుగుతూనే ఉంది. పుణె రాత్రి 10 త‌ర్వాత ఎలాంటి కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నివ్వ‌రు. దాంతో పోలీసులు కాన్స‌ర్ట్ జ‌రుగుతున్న ప్ర‌దేశానికి వ‌చ్చి స్టేజ్ ఎక్కి మ‌రీ పెర్ఫామ్ చేస్తున్న రెహ‌మాన్‌ను ఆపేయాల‌ని కోరారు. దాంతో వారు చెప్పిన‌ట్లుగానే రెహ‌మాన్ ప్యాక్ అప్ చెప్పి వెళ్లిపోయారు. అయితే పుణె పోలీసుల ప్ర‌వ‌ర్తన‌పై ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఓ ఫేమ‌స్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ను స్టేజ్ మీదే పాట ఆపండి అంటూ అగౌర‌వ‌ప‌ర‌చ‌డం స‌రికాదు అని మండిపడుతున్నారు. అప్ప‌టికే రెహ‌మాన్ లాస్ట్ పాట పాడుతున్నార‌ని, పోలీసులు పాట అయ్యాక ఆపేయాల‌ని చెప్పాల్సిందిపోయి ఇలా అర్థాంతరంగా స్టేజ్ మీద ప‌రువు తీయ‌డం త‌ప్ప‌ని అంటున్నారు.