Kerala: వావ్‌.. వాట‌ర్ మెట్రో..!

Kerala: కేర‌ళ(kerala) రాష్ట్రంలో మ‌రో అద్భుత‌మైన స‌దుపాయం రాబోతోంది. దేశంలోనే మొట్ట‌మొద‌టి వాట‌ర్ మెట్రో(water metro)ను ప్రారంభించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ(narendra modi) ప్ర‌క‌టించారు. రేపు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈ వాట‌ర్ మెట్రో(water metro)ను ప్రారంభించ‌బోతున్న‌ట్లు తెలిపారు. దీని ద్వారా నీటి ర‌వాణాకు, కేర‌ళ(kerala) ప‌ర్యాట‌క రంగానికి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని, ప్ర‌జ‌లు కూడా బాగా ఎంజాయ్ చేస్తార‌ని కేరళ సీఎం పిన‌ర‌యి విజ‌యన్(pinarayi vijayan) తెలిపారు. ఈ వాట‌ర్ మెట్రో ప‌ది ద్వీపాలను దాటుకుని ప్ర‌యాణిస్తుంది. 38 టెర్మిన‌ల్స్, 78 ఎల‌క్ట్రిక్ బోట్లు ఉంటాయి. టికెట్లు కూడా చాలా చీప్. కేవ‌లం 20 రూపాయ‌లు చెల్లించి ఈ వాట‌ర్ మెట్రో రైడ్‌ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. రోజూ ప్ర‌యాణించేవారు వీక్లీ, మంత్లీ పాసులు తీసుకోవ‌చ్చు. దీని నిర్మాణానికి అయిన ఖ‌ర్చు 1,136.83 కోట్లు. కేర‌ళ ప్ర‌భుత్వం, KfW అనే జ‌ర్మ‌న్ బ్యాంక్ ఫండ్స్‌తో దీనిని నిర్మించారు.

మొద‌టి ఫేజ్‌లో కొచ్చిలోని హైకోర్టు నుంచి విపిన్ టెర్మిన‌ల్‌కు, విట్టిల నుంచి క‌క్క‌నాడ్ టెర్మిన‌ల్ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. దాదాపు 20 నిమిషాల్లో గమ్యాల‌కు చేరుకునేలా దీనిని డిజైన్ చేసారు. ఈ వాట‌ర్ మెట్రో స్పెష‌ల్ ఫీచ‌ర్ ఏంటంటే.. దీనికి ఫ్లోటింగ్ పాంటూన్స్ ఉన్నాయి. అంటే పెద్ద అల‌లు వ‌చ్చినా మెట్రో ఒకే లెవ‌ల్‌లో ఉంటుంది. లిథియం టైటానేట్ స్పైన‌ల్ బ్యాట‌రీల‌తో ఈ మెట్రో న‌డుస్తుంది. విక‌లాంగులకు కూడా ఈ వాట‌ర్ మెట్రో సుర‌క్షిత‌మే.