చచ్చేదాకా ఉపవాసం… 21 మంది మృతి
Kenya: ఓ చర్చి ఫాదర్(pastor) కారణంగా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన కెన్యా(kenya)లో చోటుచేసుకుంది. కెన్యాలో వింత ఆచారాలు, మూఢనమ్మకాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో ఓ చర్చి ఫాదర్ చెప్పిన మాటలు విని ఉపవాసం(fasting) చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మలింది ప్రాంతానికి చెందిన పాల్ మెకెన్జీ అనే వ్యక్తి గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చిలో ఫాదర్‌గా పనిచేస్తున్నాడు. చర్చికి వచ్చిన ప్రజలతో చచ్చేదాకా ఉపవాసం చేయాలని చెప్పాడు. అలా చేస్తే అందరూ ఏసు ప్రభువును కలుస్తారని అన్నాడు. దాంతో ఫాదర్ చెప్పాడని చాలా మంది పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం చేసారు. అలా అదే చర్చిలో ఓ నలుగురు చనిపోయారు. చనిపోయిన వారి బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసారు. అలా చర్చి ఫాదర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. 21 మంది చనిపోయారని, వారిని తన పొలంలోనే పాతిపెట్టానని తెలిపాడు. అలా 21 మంది మృతదేహాలను వెలికితీసారు. చర్చి ఫాదర్ పోలీస్ కస్టడీలో ఉన్నప్పటి నుంచి ఉపవాసం చేస్తున్నాడట. 2019 మార్చిలో కూడా పిల్లల చేత ఉపవాసం చేయించి వారి చావుకు కారణమయ్యాడని పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ తర్వాత బాండ్‌పై విడుదలయ్యాడు. ఈ రెండు కేసులు విచారణలో ఉన్నాయి. అతన్ని మరోసారి ఎటువంటి బాండ్‌పై విడుదల చేయకూడదని స్థానిక రాజకీయనేతలు డిమాండ్ చేస్తున్నారు.