ఇంటర్‌లో తక్కువ మార్కులు.. ఇల్లు అద్దెకు ఇవ్వనన్న ఓనర్
Bengaluru: ఒకరికి ఇల్లు అద్దెకు(rent) ఇవ్వాలంటే ఏం చూడాలి? వారింట్లో ఎవరెవరు ఉంటారు, వారి ఉద్యోగం ఏంటి.. ఇవే అడుగుతారు ఎవరైనా. కానీ కర్ణాటక రాజధాని బెంగళూరు(bengaluru)లో మాత్రం ఓనర్లు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. వర్క్ ఫ్రం ఆఫీస్ రూల్ మొదలవ్వగానే బెంగళూరులో పనిచేసే ఉద్యోగులు స్వస్థలాలను వదిలేసి వెనక్కి వస్తున్నారు. ఈక్రమంలో బెంగళూరులో రెంట్లు విపరీతంగా పెరిగిపోయాయి. రెంట్లు పెరగడంతో పాటు ఓనర్ల డిమాండ్లు కూడా ఊహించని విధంగా ఉంటున్నాయి. ఇటీవల ఓ టెకీ ఇల్లు అద్దెకు కావాలని ఓ బ్రోకర్‌ను కలిసాడు. అతను ఓ మంచి ఇంటిని చూపించి ఓనర్‌తో మాట్లాడించాడు. ఆ ఓనర్ అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి అతనికి ఇల్లు అద్దెకు ఇవ్వలేనని చెప్పేసాడు. కారణం ఏంటంటే.. ఆ టెకీకి ఇంటర్‌లో 70 శాతం మాత్రమే వచ్చిందట. ఆ ఓనర్ కనీసం 90% వస్తే కానీ అద్దెకు ఇవ్వడట. అది చూసి టెకీ షాకయ్యాడు. వారి చదువు, పర్సెంటేజీలతో ఓనర్లకు ఏం సంబంధం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.