Margadarshi: ద‌ర్యాప్తుకు స‌హ‌క‌రించ‌ని ఎండీ శైలజ కిర‌ణ్‌

Hyderabad: మార్గదర్శి (margadarshi) చిట్‌ ఫండ్స్‌ కేసు విచారణ సమయంలో ఆ సంస్థ ఎండీ రామోజీరావు కోడలు సీహెచ్‌ శైలజా కిరణ్‌ (sailaja kiran) ఆంధ్రప్రదేశ్‌ CID అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఐడీ ఐజీ శ్రీకాంత్‌ తెలిపారు. సూటిగా అడిగిన ప్రశ్నలకు తన వద్ద సమాచారం లేదని చెబుతున్నారని, తనకు అనారోగ్యం సరిగాలేదని ఎక్కువ సేపు కూర్చోలేనని చెప్పి విచారణకు సహకరించడం లేదని ఐజీ శ్రీకాంత్‌ పేర్కొన్నారు. ఈ సందర్బంగా విచారణకు సంబంధించి ఈనాడు పత్రిక, ఈటీవీ ఛానల్లో వస్తున్న తప్పుడు కథనాలను ఆయన ఖండించారు. ఏపీ సెక్రటేరియట్‌లో బుధవారం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసి పలు వివరాలను తెలియజేశారు.

మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ తమ విచారణకు సహకరించలేదని సీఐడీ ఐజీ శ్రీకాంత్‌ తెలిపారు. సూటిగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాటవేస్తున్నారని ఆయన అన్నారు. ఏదైనా అంశానికి సంబంధించి వివరాలు అడిగితే.. తన మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్ల వద్ద ఆ సమాచారం ఉంటుందని, ఎండీ స్థాయిలో ఆ వివరాలు తన దగ్గర ఉండాల్సిన అవసరం లేదని చెప్పినట్లు ఐజీ తెలిపారు. అంతేకాకుండా.. విచారణ సమయంలో తనకు ఆరోగ్యం బాలేదని, తనకు మరోసారి సమయం ఇవ్వాలని కోరారు. కేవలం 25 శాతం ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇచ్చారని.. మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు ఆమె దాటవేశారని ఐజీ వివరించారు. విచారణకు వెళ్లిన ప్రతిసారి తనకు పనులు ఉన్నాయని, ఇప్పుడు కుదరని శైలజా చెబుతూ వస్తున్నారని.. ఇది ఉద్దేశ పూర్వకంగా కేసును పక్కదారి పట్టించడమేనని ఆయన పేర్కొన్నారు. కనీసం సీఐడీ నుంచి వారికి మోయిల్‌ పంపితే దానికి కూడా సరిగా సమాధనాం చెప్పడం లేదన్నారు. చెప్పిందే చెబుతూ.. ప్రశ్నలు సూటిగా అడుగుతున్నప్పుడు సమాధానాలు సరిగా చెప్పడం లేదని ఐజీ శ్రీకాంత్‌ మీడియాకు తెలిపారు.