ఆత్మహత్య నుంచి కాపాడి.. హత్య చేసాడు!
Chattisgarh: ఆత్మహత్య(suicide) చేసుకోబోతున్న భార్యను కాపాడి మరీ హత్య(murder) చేసాడు ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. జాష్పూర్ జిల్లాకు చెందిన శంకర్ రామ్ రోజూ తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపెట్టుకునేవాడు. నిన్న కూడా తాగి ఇంటికి వెళ్లాడు. తనతో సెక్స్ చేయాలని భార్యను బలవంతం చేసాడు. శంకర్ రామ్ ఆగడాలు భరించలేక అతని భార్య ఇంటి దగ్గరున్న బావిలో దూకేసింది. అది చూసిన శంకర్ రామ్ వెంటనే బావిలోకి దూకి భార్యను కాపాడాడు. ఆ తర్వాత కూడా గొడవ జరగడంతో ఆమె ప్రైవేట్ భాగాలపై తీవ్రంగా కొట్టి దాడి చేసాడు. దాంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు శంకర్ రామ్‌ను అరెస్ట్ చేసారు.