Liger: ఫిలిం చాంబర్ వద్ద ఉద్రిక్తత.. పూరీ డబ్బు ఇవ్వాల్సిందేనట
Hyderabad: దర్శకుడు పూరీ జగన్నాథ్(puri jagannath), విజయ్ దేవరకొండ(vijay devarakonda) కాంబినేషన్‌లో వచ్చిన లైగర్(liger) సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో సినిమాను కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోయారు. తమ డబ్బు తిరిగివ్వాలని కొన్ని నెలలుగా పూరీ జగన్నాథ్‌ని నిలదీస్తున్నారు. ఈ వివాదం ఇంకా చల్లారలేదు. సరిగ్గా పూరీ తన కొత్త సినిమాను ప్రకటించడానికి వారం ముందు తెలంగాణ ఎగ్జిబిటర్స్ & లీగర్స్ అసోసియేషన్ సభ్యులు ఫిలిం చాంబర్ వద్ద నిరాహారదీక్ష చేస్తున్నారు. దాంతో ఫిలిం చాంబర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికైనా పూరీ తమ బాధను అర్థంచేసుకుని రీఫండ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ధర్నాలపై పూరీ స్పందిస్తూ.. గతంలో పోకిరి, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు హిట్ అయినప్పుడు లాభాలు వస్తే తనకేమన్నా షేర్ ఇచ్చారా అని ఎదురు ప్రశ్న వేసారు. అలాంటప్పుడు నష్టాలు వస్తే ఎందుకు రీఫండ్ అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఈ నెల 15న రామ్ పోతినేని బర్త్‌డే సందర్భంగా.. ఆయనతో చేయబోయే సినిమాను పూరీ ప్రకటించబోతున్నారు. సరిగ్గా ఆ సినిమా అనౌన్స్‌మెంట్‌కి ముందు లైగర్ ఎగ్జిబిటర్లు ఇలా నిరాహారదీక్ష చేయడంపై పలు విమర్శలు వస్తున్నాయి.